calender_icon.png 29 September, 2024 | 7:50 AM

డాన్‌గా ఎదగాలని ఆయుధాల కొనుగోళ్లు

29-09-2024 01:52:29 AM

యువకుడిని అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు

ఎల్బీనగర్, సెప్టెంబర్ 28: డాన్ కావాలనే కోరికతో చదువును మధ్యలోనే ఆపేసి చోరీలకు పాల్పడతున్న ఓ యువకుడిని పోలీసు లు అరెస్టు చేశారు. ఎల్బీనగర్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో శనివారం సీపీ సుధీర్‌బాబు కేసు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడకు చెందిన బొల్లింకల సాయిరాంరెడ్డి(25) బీకాం(కంప్యూటర్) చదువును మధ్యలోనే ఆపేసి కాకినాడలోని ఒక షాపింగ్‌మాల్‌లో పనిచేశాడు.

అనంతరం హైదరాబాద్‌లోని సూరారంలోని ఓ హాస్టల్‌లో ఉంటూ నాగోల్‌లోని అమెజాన్ బ్రాంచ్‌లో పనిచేస్తున్నా డు. ఈ క్రమంలో సులువుగా డబ్బులు సంపాదించాలనే దుర్భుద్దితో ఉప్పల్, కాకినాడలో చోరీల కు పాల్పడి జైలుకు వెళ్లాడు. జైలులో నేరస్తుల పరిచయాలతో డాన్‌గా ఎదగాలని కలలు కన్నాడు. 

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరస్తులతో పరిచయాలు పెంచుకొని ముంబై ముఠాతో సంప్రదింపులు జరిపాడు. ఇటీవల ముం బైకి వెళ్లి ఏడు తుపాకులు (రివాల్వార్), బుల్లెట్లు కొనుగోలు చేసి హైదరాబాద్‌కు వచ్చాడు. అయితే ఈవిషయం పోలీసులకు తెలవడంతో..

మల్కాజిగిరి ఎస్‌వోటీ, నేరేడ్‌మెట్ పోలీసులు ఈనెల 27న ఆర్‌కేపురం ప్రాం తంలో సాయిరాంరెడ్డిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. అనంతరం ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసులకు రివార్డులను అందజేశారు.