04-04-2025 12:36:20 AM
కూసుమంచి ఏప్రిల్ 3 :-రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధరపై ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.గురువారం మంత్రి, కూసుమంచి మండలంలో పర్యటించారు. ముందుగా మంత్రివర్యులు కూసుమంచి మండలం నాయకన్ గూడెంలోని గంగమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని నాయకన్ గూడెంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత కల్పించామని, రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. గడిచిన సంవత్సర కాలంలో 25 లక్షల 65 వేల రైతన్నలకు 20 వేల 687 కోట్ల రూపాయలతో 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేసామన్నారు.
గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన రైతు బంధు నిధులను ప్రజా ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. యాసంగిలో కూడా సన్న రకం ధాన్యానికి బోనస్ చెల్లించి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, డిఆర్డీవో సన్యాసయ్య, జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ జి. శ్రీలత, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, అడిషనల్ డిఆర్డీవో నూరొద్దీన్, తహసీల్దార్ కరుణశ్రీ, తదితరులు పాల్గొన్నారు.
నిరంతర విద్యుత్ సరఫరాకు కట్టుదిట్టమైన చర్యలు
ఖమ్మం, ఏప్రిల్ 3 ( విజయక్రాంతి ): నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం మంత్రి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించారు. మద్దులపల్లిలో మద్దులపల్లి నుండి తల్లంపాడు - తెల్దారుపల్లి జెడ్పీ రోడ్డు వరకు సి.ఆర్.ఆర్. నిధులు ఒక కోటి 80 లక్షలతో నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు, వరంగల్ క్రాస్ రోడ్డులో తరుణి హాట్ నందు 2 కోట్లతో ఏర్పాటు చేయనున్న 33/11 కెవి విద్యుత్ ఉప కేంద్రం పనులకు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ నిరంతర విద్యుత్ సరఫరా అన్ని రంగాలకు అందించేందుకు ప్ర భుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన ప్రాం తాలలో సబ్ స్టేషన్ లను అభివృద్ధి చేస్తుందన్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా పేదల అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం నిబద్దతతో పని చేస్తుందన్నారు.అనంతరం ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు గ్రామంలో గూడూరు పాడు నుండి గోళ్లపాడు - ఊటవాగు తండ రోడ్డు వరకు 2 కో ట్ల 97 లక్షలతో నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఓపెన్ కాస్ట్ విస్తరణ ప్రాజెక్టులో భూములు, ఇండ్లు కోల్పోతున్న వారికి చట్టప్రకారం ఇవ్వాలని వినతి
ఇల్లెందు, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): ఇల్లెందు జేకే-5 ఎక్స్టెన్షన్ ఓపెన్ కాస్ట్ విస్తరణ ప్రాజెక్టు లో భూములు, ఇండ్లు కోల్పోతున్న వారికి 2013 భూ నిర్వాసిత పునరావాస చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని రెవె న్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, ఇల్లందు ఎం ఎల్ ఏ కోరం కనకయ్య ఆధ్వర్యంలో అఖిలపక్షం, భూ నిర్వాసితులు కలిసి వినతి పత్రం అందజేశారు.
ఇల్లందు జే కే 5 ఎక్స్టెన్షన్ ఓపెన్ కాస్ట్ పూసపల్లి, విజ య లక్ష్మీ నగర్, తిలక్ నగర్, 21 ప్రాంతంలో నిర్వాసితులుగా మారుతున్న ప్రజలకు జెకె 5 ఓసి లో ఇచ్చిన విధంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ ప్రజలు అఖిలపక్షం సహకారంతో స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య సహకారంతో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఖమ్మంలోని ఆయన నివాసం లో కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ఇచ్చిన ప్యాకేజీ యధావిధిగా కొనసాగించేట్లు కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపా రు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పూనెం సురేందర్ ,విజయలక్ష్మి నగర్ మాజీ సర్పంచ్ పూనెం కవిత, అఖిల పక్ష నేతలు అబ్దుల్ నబి, వెన్నంపల్లి శ్రీనివాస్, ఎట్టి హరికృష్ణ, క్లింట్ రోచ్, సదరం మహేష్, స్థానిక అడ్వకేట్ సూర్ణపాక సత్యనారాయణ, దనసరి రాజు, వడ్డేపల్లి సురేష్, సదరం రాజు, సూరజ్ మౌర్య, వట్టం రాజు, బండి సతీష్, ఉబ్బని ఈశ్వర్, హరిసింగ్, కనకయ్య, పోకల రాధ, కళ్యాణి, ఎట్టి శ్రీలత, పూనెం రాంబా యి, మనోజ్ సాహు, మాదాసు రమేశ్, జమున, తదితరులు పాల్గొన్నారు