calender_icon.png 16 April, 2025 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లో స్కోరింగ్‌లో పంజాబ్‌దే విజయం

16-04-2025 12:39:41 AM

  1. 16 పరుగుల తేడాతో కోల్‌కతా ఓటమి
  2. నేడు ఢిల్లీతో రాజస్తాన్ అమీతుమీ

ముల్లన్‌పూర్, ఏప్రిల్ 15: ఐపీఎల్ 18వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ నాలుగో విజయా న్ని నమోదు చేసుకుంది. మంగళవారం ముల్లన్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో పం జాబ్ కింగ్స్ 16 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. బౌలింగ్‌కు అనుకూ లించిన పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 15.3 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది.

ప్రభ్‌సిమ్రన్ సింగ్ (30), ప్రియాన్ష్ ఆర్య (22) మినహా మిగతావారం తా విఫలమయ్యారు. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రానా 3 వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్‌క తా 15.1 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది.

అంగ్‌క్రిష్ రఘువంశీ (37) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రసెల్ (17) జట్టును గెలిపించలేకపోయాడు. పంజాబ్ బౌలర్లలో యజ్వేంద్ర చాహల్ 4 వికెట్లతో మెరవగా.. మార్కో జాన్సెన్ 3 వికెట్లు పడగొట్టాడు. నేడు జరగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది.