calender_icon.png 12 February, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘డంకీ’ మార్గంలో గుండెపోటుతో పంజాబ్ వ్యక్తి మృతి

11-02-2025 12:57:37 AM

వాషింగ్టన్, ఫిబ్రవరి 10: అక్రమ మార్గం ద్వారా అమెరికా చేరుకునే ప్రయత్నంలో పంజాబ్‌కు చెందిన వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ఆ వ్యక్తిని అజ్నాలాకు చెందిన గురుప్రీత్‌సింగ్‌గా  గుర్తించారు. అమెరికాలోకి ప్రవేశించడానికి అక్రమ మార్గమైన ‘డంకీ’ ద్వారా వెళ్లడానికి గురుప్రీత్‌సింగ్ కుటుంబం ఏజెంట్లకు రూ. 16.5లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది.

గురుప్రీత్‌సింగ్ కుటుంబాన్ని సందర్శించి మంత్రి కుల్దీప్‌సింగ్  సంతాపం తెలియజేశారు. సింగ్ మృతదేహాన్ని పంజాబ్‌కు తీసుకురావడానికి ప్రభు త్వం కృషి చేస్తుందని మంత్రి చెప్పారు. అక్రమ వలసల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి బదులుగా, ఆ డబ్బుతో రాష్ట్రంలోనే వ్యాపారాలు ప్రారంభించాలని కోరారు.