calender_icon.png 3 April, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గర్జించిన పంజాబ్ కింగ్స్

02-04-2025 12:32:54 AM

  1. లక్నోపై 8 వికెట్ల తేడాతో విజయం
  2. రాణించిన ప్రభ్‌సిమ్రన్, శ్రేయస్ అయ్యర్
  3. నేడు బెంగళూరుతో గుజరాత్ ‘ఢీ’

లక్నో, ఏప్రిల్ 1: ఐపీఎల్ 18వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై సునాయాస గెలుపును సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.

నికోలస్ పూరన్ (44), ఆయుశ్ బదోని (41) రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 16.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే నష్టపోయి 177 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (69) మెరుపు అర్థసెంచరీతో ఆకట్టుకోగా..

కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (52 నాటౌట్), నిహాల్ వధేరా (43 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్ సింగ్ 2 వికెట్లు తీశాడు. నేడు జరగనున్న మ్యాచ్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.