calender_icon.png 15 January, 2025 | 11:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల డిమాండ్లపై కరువైన ప్రభుత్వ స్పందన

08-12-2024 01:56:57 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): పంజాబ్-హరియాణా సరిహద్దు శంభు వద్ద మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. పంజాబ్ రైతులు మళ్లీ 'చలో ఢిల్లీ' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక రోజు తర్వాత 'చలో ఢిల్లీ' మళ్లీ పునరుద్ధరించిన రైతులను పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు.  అనుమతి లేఖ ఉంటేనే పాదయాత్రకు వెళ్లనిస్తామని పోలీసులు తెలిపినప్పటికి, ఎలాంటి అనుమతి లేకున్న జెండాలు చేతపట్టుకొని రైతులు ముందుకు కదిలారు. దీంతో రైతులపై బాష్పవాయుగోళాలను పోలీసులు ప్రయోగించారు. శుక్రవారం 'చలో ఢిల్లీ' పేరుతో పాదయాత్ర నిర్వహించని 101 మంది రైతులు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చర్చలు చేపట్టాలన్న రైతుల డిమాండ్లపై ప్రభుత్వ స్పందన కరువ్వడంతో మళ్లీ పాదయాత్రను చేపట్టడంతో శంభు వద్ద భారీగా పోలీసులు, పారా మిలిటరీ బలగాల మోహరించాయి.