26-03-2025 01:38:30 AM
గుజరాత్‌పై విజయం
అహ్మదాబాద్, మార్చి 25: ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు చేసింది.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (97 నాటౌట్), శశాంక్ (44 నాటౌట్) చెలరేగారు. సాయి కిషోర్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (74) టాప్ స్కోరర్‌గా నిలిచాడు .పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ ౨ వికెట్లు పడగొట్టాడు.