calender_icon.png 19 April, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మారణహోమం సృష్టించిన వారికి శిక్ష సబబే

09-04-2025 01:40:45 AM

కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

ఉగ్రవాదానికి ఊతమిచ్చే శక్తులను కట్టడి చేయాలి: ఎంపీ డా.లక్ష్మణ్

ఉరి తీర్పుతో దేశమంతా హర్షం: కేంద్రమంత్రి బండి సంజయ్

హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబుపేలుళ్ల ఘటనపై తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతి స్తున్నామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

మారణహో మాన్ని సృష్టించిన ఉగ్రవాదులకు ఉరే సరైన శిక్ష అని తెలంగాణ అత్యున్నత న్యాయస్థా నం పేర్కొనడం ప్రజాస్వామ్యంలో హి ంస, ఉగ్రవాదానికి చోటు లేదని మరోసారి స్పష్టమైందని ఒక ప్రకటనలో తెలిపారు.

12 ఏం డ్లుగా ఓ పీడకలలా వెంటాడుతున్న బా ధితుల కుటుంబాలకు సరైన న్యాయం జరిగిందని భావిస్తున్నట్టు చెప్పారు. బాధి త కుటుంబాల కు తాము అం డగా ఉంటామని స్పష్టం చేశారు. ఎన్‌ఐఏ కోర్టు విధిం చిన ఉరిశిక్షను హైకోర్టు సమర్థించడం పట్ల బీజేపీ పార్టీ పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు.

ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు జీరో టాలరెన్స్ విధానంతో మోదీ ప్రభు త్వం పనిచేస్తోందన్నారు. గత 11 ఏళ్ల బీజేపీ పాలనలో ఇలాంటి ఘటనలకు తావు లేకుం డా చేసినట్టు తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి.. ఉగ్రవాదాన్ని సంపూర్ణంగా నిర్మూలించే దిశగా మోదీ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందన్నారు.

ప్రజాస్వామ్యంలో బుజ్జగింపు రాజకీయాలను ఏ మాత్రం ప్రోత్సహించకూడదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలని కో రారు. జాతీయ దర్యాప్తు సంస్థ సమగ్ర విచారణ చేసి, నిందితులను శిక్షించడంలో కీలకపాత్ర వహించిందని చెప్పారు. ఈ పేలుళ్ల సంఘటన దర్యాప్తు చేసిన పోలీస్ సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు.

ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశాం: ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్

దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసు లో ఐదుగురు నిం దితులకు హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడాన్ని స్వాగతిస్తున్నామని బీజే పీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. మోదీ ప్రభు త్వం అధికారంలోకి రాకముందు దేశమం తా ఉగ్రవాదుల కార్యకలాపాలు కొనసాగేవని, వాటన్నింటికీ హైదరాబాద్‌తో లింకులు ఉండేవన్నారు.

కానీ పదేళ్లలో దేశంలో అలాంటి ఘటనలే లేకుండా పూర్తిగా కట్టడి చేసి, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసినట్టు తెలిపారు. హైదరాబాద్‌లో ఇప్పటికీ ఉగ్రవాదానికి ఊతమిచ్చే శక్తులుంటే వాటిని కట్టడి చేయాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపై ఉందన్నారు. హైకోర్టు తీర్పు చారిత్రాత్మకమని.. ఉగ్రవాదులకు ఇదో హెచ్చరిక అని ఆయన పేర్కొన్నారు. 

ఉగ్రవాదులకు గుణపాఠం: కేంద్రమంత్రి బండి సంజయ్

దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో దోషులకు ఉరిశిక్ష విధిస్తూ ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్థిస్తూ నిందితులకు ఉరి శిక్ష విధించడాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ స్వాగతించి, హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు ను యావత్ దేశమంతా హర్షిస్తోందన్నారు. అశాంతి కాముకులు చేసిన నరమేధం ఎన్నో కుటుంబాలకు గర్భశోకం మిగిల్చిందని వాపోయారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన న్యాయవ్యవస్థ ఇచ్చిన తీర్పు గుణపాఠంగా మారనుందన్నారు.