14-02-2025 01:16:33 AM
* కార్పొరేట్ స్కూళ్ళ యాజమాన్యాల నిర్వాకం
* విద్యాహక్కు చట్టానికి తూట్లు పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
* ఆత్మహత్య చేసుకున్నా స్పందించని సర్కారు
మేడ్చల్, ఫిబ్రవరి 13(విజయ క్రాంతి): ఫీజుల కోసం కార్పొరేట్ స్కూళ్ళ యాజమా న్యాల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఫీజు చెల్లించాలని విద్యార్థులను వేధించడమే గాక, పనిష్మెంట్ కూడా ఇస్తున్నారు. దీంతో పసి హృదయాలు మానసిక క్షోభకు గురవుతు న్నాయి. వేధింపులను, పనిష్మెంట్లను తట్టుకోలేక విద్యార్థులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విద్యాశాఖ అధికారులు స్పందిం చడం లేదు. యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడం లేదు. మేడ్చల్ లోని శ్రీ చైతన్య పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న అఖిల అనే విద్యార్థిని ప్రిన్సిపల్ తరచూ ఫీజు గురించి ప్రశ్నించ డమే గాక, తల్లిదండ్రులతో జరుగుతున్న సమావేశానికి పిలిచి ఫీజు విషయమై గట్టిగా ప్రశ్నిం చడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.
ఇది జరిగిన రోజే ద క్రీక్ పాఠశాల లో ఒక విద్యార్థిని బస్సు ఎక్కని య్యలేదు. ఇదే పాఠశాలలో రెండు వారాల క్రితం మరో విద్యార్థిని ఇంటికి పంపలేదు. అఖిల ఆత్మహత్య చేసుకున్న మరుసటి రోజు గురువారం సెయింట్ ఆన్స్ పాఠశాలలో ఫీజు కట్టలేదని ఏడో తరగతి విద్యార్థి దీనాను పరీక్ష రాయనీయలేదు.
పాఠశాలల యాజమాన్యాల కు అధికారులు చర్యలు తీసుకుంటారని భయం లేకనే ఇలా వ్యవ హరిస్తున్నట్టు తెలుస్తోంది. విద్యా సంవత్స రం ముగుస్తున్నందున యాజమాన్యాలు ప్రిన్సిపాల్, టీచర్లకు టార్గెట్లు పెట్టి వసూలు చేయిస్తున్నాయి. జీతాలు ఇవ్వబోమని చెప్ప డంతో వారు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
విద్యా హక్కు చట్టం ఉల్లంఘన
కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యాహక్కు చట్టం నిబంధన లు బహిరంగంగానే ఉల్లంఘి స్తున్నాయి. ఫీజు చెల్లించాలని విద్యార్థులను అడగవద్దు. కానీ విద్యార్థులను వేధిస్తున్న పట్టిం చుకునే వారు లేరు. విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించడం లేదు. అధిక ఫీజులు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్న పట్టించు కోవడం లేదు.
విద్యాశాఖ అధికారుల తీరుపై నిరసన
మేడ్చల్‌లో అఖిల ఆత్మహత్యాయత్నం చేసి ఒకరోజు ఆసుపత్రిలో చికిత్స పొందు తూ మృతి చెందింది. విద్యాశాఖ అధికారు లు ఒక్కరు కూడా పాఠశాలకు వచ్చి ఏమి జరిగిందో వివరాలు సేకరించకపోవడం విస్మయం కలిగిస్తోంది. వాస్తవానికి వెంటనే పాఠశాలకు వచ్చి తగిన చర్యలు తీసు కోవాలి. విద్యాశాఖ అధికారులు తమ బాధ్య త కాదన్నట్లు వ్యవహరించారు. విద్యార్థిని చనిపోతే ప్రభుత్వం కూడా స్పందించలేదు.
తల్లి పుస్తెలతాడు తాకట్టు పెట్టిన దక్కని ప్రాణం
అఖిల ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో ఉండగా, వైద్య ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో తల్లి కమల పుస్తెలతాడు తాకట్టు పెట్టింది. డబ్బులు సరిపోక పోవడంతో కూతురు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగానే స్కూలుకు వచ్చి తన కూతురును కాపాడాలని వేడుకుంది. యాజమాన్యం కనీసం స్పందించలేదు. మానవత్వం చూపకుండా తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించింది. స్కూల్ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.