calender_icon.png 2 January, 2025 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా కొడుకు చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించండి

30-12-2024 06:36:42 PM

నిర్మల్ (విజయక్రాంతి): నా కొడుకును గారాబంగా పెంచుకున్న మేడం.. అన్యాయంగా సంపివేసిండ్రు.. వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న వంశీకృష్ణ తల్లిదండ్రులు సోమవారం జిల్లా ఎస్పీని కలిసి ఏడ్చారు. హత్యకు కారణం వేధింపులేనని నిందితులకు కఠినంగా శిక్షపడే వరకు తన పోరాటాన్ని కొనసాగిస్తానని జిల్లా ఎస్పీకి తల్లి తన ఆవేదనతో వ్యక్తం చేశారు. రెండు మూడు రోజుల్లో వారిని పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆందోళన చెందవలసిన అవసరం లేదని కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఉపేందర్ రెడ్డి, డిఎస్పి గంగారెడ్డి, సీఐ ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.