06-03-2025 12:16:26 AM
హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించాల్సిందేనని.. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. బుధవా రం జూబ్లీహిల్స్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీస్‌లో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వ హించారు.
గాంధీ హాస్పిటల్‌లో ముందస్తు సమాచారం లేకుండా డాక్టర్లు డ్యూటీలకు డుమ్మా కొట్టడంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్య క్తం చేశారు. అన్ని మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లలో వైద్యుల హాజరు పై శ్రద్ధ పెట్టాలని డీఎంఈ నరేంద్రకుమార్‌ను ఆదేశించారు. బయో మెడికల్ ఇంజినీర్లు, టెక్నీషియన్ల నియామకానికి చర్యలు తీసుకోవాల ని సూచించారు. గాంధీలో ఏర్పాటు చేస్తున్న అవయవ మార్పిడి కేంద్రం పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు.