calender_icon.png 31 October, 2024 | 8:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులంలో ఓ మహిళకు పూనకం.. మల్లన్న గుడి కట్టించాలని కోరిక

14-08-2024 01:12:09 PM

గురుకులంలో మల్లన్న గుడి నిర్మిస్తేనే శాంతిస్తానంటూ కేకలు, పొర్లు దండాలు

ఆలయం నిర్మించకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతమౌతాయి 

జగిత్యాల: గురుకులంలో ఓ విద్యార్థి తల్లి ఉన్నట్టుండి ఒక్కసారిగా కింద పడిపోయి కేకలు వేస్తూ పూనకం వచ్చినట్లు ఊగిపోయి పొర్లు దండాలు పెట్టింది. వివరాల్లోకి వెళితే... జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కౌశిక్ అనే విద్యార్థి తల్లి కృష్ణవేణికి పూనకం వచ్చి కింద పడిపోయింది. నాగదేవత రూపంలో పునకంతో ఇక్కడ మల్లన్న గుడి నిర్మిస్తే శాంతిస్తా... ఆలయం నిర్మించకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతాయంటూ ఆ మహిళ స్పష్టం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

గడిచిన 20 రోజులలో పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, నలుగురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే ఇద్దరు విద్యార్థులు పాముకాటుతో మృతి చెందినట్లు అనుమానాల వ్యక్తం అవుతుండగా పరిసరాల్లో కుప్పలు తెప్పలుగా పాములు పుట్టలుండగా పాముల బయట పడడం మరింత అనుమానాలకు బలం చేకూర్చుతున్నట్లు అవుతుంది. దీనికి తోడు ఆ మహిళ గురుకులంలో కేకలు వేస్తూ పూనకం వచ్చినట్లు ఊగిపోయి పొర్లు దండాలు పెట్టడం కలకలం సృష్టిస్తుందటం గమనార్హం.