05-04-2025 08:26:41 PM
ఔదార్యం చాటుకున్న కొట్టే సంపత్..
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని వెంకటాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఆర్కే-5 కాలనీలోని హ్యాండ్ బోర్ కు పంప్ సెట్ విరాళం అందించి తన ఔదార్యం చాటుకున్నారు గ్రామానికి చెందిన కొట్టే సంపత్. గ్రామానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కొట్టే సంపత్ తన తండ్రి కొట్టే రాజయ్య పటేల్ జ్ఞాపకార్థం, అంతే కాకుండా తన కుమారుడు విహన్ కుమార్ జన్మదినంను పురస్కరించుకొని గ్రామంలోని ఆర్కే5 కాలనీలోని హ్యాండ్ బోర్ కు పంప్ సెట్ ను శనివారం విరాళంగా అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో వేసవి మూలంగా నీటి ఇబ్బందులు అధికంగా ఉన్నాయని ముఖ్యంగా హ్యాండ్ బోర్ ల వద్ద గ్రామస్థులు నీటి కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని, వారి ఇబ్బందులు తొలగించేందుకు తన వంతుగా పంప్ సెట్ అందించడం జరిగిందన్నారు. గ్రామస్థులు తమ సమస్యలు తన దృష్టికి తీసుకు వస్తే వాటి పరిష్కారా నికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. ఈసందర్భంగా హ్యాండ్ బోర్ కు పంప్ సెట్ విరాళం అందించిన సంపత్ ను గ్రామస్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.