calender_icon.png 19 February, 2025 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి పుల్లూరు బండ జాతర

28-01-2025 12:00:00 AM

సిద్దిపేట, జనవరి 27 (విజయక్రాంతి): నేటి నుండి ఈనెల 31వ తేదీ వరకు పుల్లూ రు బండ జాతర ఉత్సవాలు ప్రారంభం అవుతాయని, ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ వంశపార్యం పర్య అర్చకులు కలకుంట్ల రంగాచార్యులు, దేవాలయ ఉత్సవ కమిటీ చైర్మన్ పుల్లూరి కనకయ్య గౌడ్ లు తెలిపారు. సోమవారం సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఉత్సవాలకి సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లా డుతూ.. జాతరలో భాగంగా రథయాత్ర నిర్వహించి స్వామి వారిని గ్రామంలో ఉరేగిస్తామని, 29వ తేదీన భక్తులు పవిత్ర స్నానాలు చేయనున్నారని, 30న గోపాల కాలువల సేవ, జానపద సాంస్కృతిక ఉత్స వం, 31న లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం జరుపుతామని, 1వ తేదీన చక్ర తీర్థం తో జాతర ముగుస్తుందని తెలిపారు.

కార్య క్రమంలో వంశ పారంపర్య అర్చకులు రామకృష్ణ, శేషు, కాంగ్రెస్ పార్టీ మండ ల అధ్యక్షుడు రాములు, ఓబీసీ సెల్ రూర ల్ మండలాధ్యక్షుడు గరిపల్లి వెంకటి, దేవా లయ డైరెక్టర్లు ఒగ్గు యాదయ్య, రాములు, గొడుగు రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం శ్రీనివాస్, అంజిరెడ్డి, పెంబర్తి మల్లే శం, రామస్వామి తదితరులు పాల్గొన్నారు