calender_icon.png 18 April, 2025 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడాకారులకు పుల్లెల గోపీచంద్ అభినందనలు

15-04-2025 05:42:58 PM

హైదరాబాద్: క్రీడా పోటీల్లో అత్యుత్తమ  ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ కార్యదర్శి, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ మంగళవారం అభినందించారు. గచ్చిబౌలిలోని కొటక్ పుల్లెల గోపీచంద్ బ్యాట్మింటన్  అకాడమీలో గోవాలో జరిగిన నేషనల్ మాస్టర్స్  బ్యాట్మింటన్  టోర్నమెంట్ లో మెడల్స్ సాధించిన క్రీడాకారులను బ్యాట్ జాయింట్ సెక్రెటరీ యు వి ఎన్ బాబు,  బ్యాట్మింటన్  అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ కానూరు వంశీధర్ ఆధ్వర్యంలో క్రీడాకారులను ఘనంగా సత్కరించి అభినందించారు.

35 ప్లస్ క్యాటగిరి  ఎస్ అప్పారావు బ్రాంచ్ మెడల్ సాధించాడు. 35 ప్లస్ క్యాటగిరి ఉమెన్స్ డబుల్స్ లో  ప్రభిను సిల్వర్ మరియు మిక్స్ డ్ డబుల్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించారు. 55 ప్లస్ క్యాటగిరిలో మిక్స్ డబుల్స్ లో  ఏం కమలాకర్ రావు  బ్రాంజ్ మెడల్ సాధించాడు. 60 ప్లస్ కేటగిరి మెన్ డబుల్స్ లో ఏవీఎస్ మూర్తి గోల్డ్ మెడల్  60 ప్లస్ సింగిల్స్ లో సిల్వర్,  మిక్స్ డబుల్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించాడు. 75 ప్లస్ క్యాటగిరి సింగిల్స్ లో పి రాజలింగం బ్రాంచ్ మెడల్, మెన్స్ డబుల్స్ లో బ్రాంచ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ క్రీడా పోటీలు క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతొ పాటు పేరు ప్రఖ్యాతలు అందుతాయని  తెలిపారు.