calender_icon.png 3 April, 2025 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని హద్దులనూ ధిక్కరించే ప్రేమకథ

22-03-2025 12:00:00 AM

పులకిత్ సామ్రాట్, ఇసాబెల్లె కైఫ్ జంటగా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘సుస్వాగతం ఖుష్మాదీద్’. ఈ సినిమాను ధీరజ్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో వసీమ్ ఖురేషి, షర్వాన్ అగర్వాల్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ప్రియాంక సింగ్, రితురాజ్ సింగ్, మేఘనా మాలిక్, అరుణ్ బాలి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మేకర్స్ తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

ఈ చిత్రాన్ని మే 16న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు చిత్రబృందం సోషల్ మీడియాలో రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను పంచుకుంది. ముఖ్యంగా సినీప్రియులను దృష్టిని ఆకర్షించేందుకు చిత్రబృందం.. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌కు ఆసక్తికరమైన వ్యాఖ్యలు జోడించింది.

‘రెండు హృదయాలు, రెండు విశ్వాసాలు.. అన్ని హద్దులనూ ధిక్కరించే ఓ ప్రేమకథ’ అని ఈ పోస్ట్‌లో రాసుకురావడం అందరినీ ఆలోచింపజేస్తోంది. పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా ఓ సామాజిక సందేశం కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరో పులకిత్ ఢిల్లీలో నివసించే కుర్రాడి పాత్రలో నటిస్తుండగా, హీరోయిన్ ఇసాబెల్లె కైఫ్ ఆగ్రాకు చెందిన నూర్ అనే అమ్మాయిగా కనిపించనుంది.