హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): రాబోయే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్‌కు ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్ల సంఘం పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి తెలిపారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేసే లెక్చరర్లు అందరూ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు పూల రవీందర్‌కే వేసి గెలిపించాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు. పూల రవీందర్‌కు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల లెక్చరర్ల సంఘం సైతం మద్దతు ఇస్తున్నట్టు అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ప్రధానకార్యదర్శి బ్రిజేష్ మరో ప్రకటనలో తెలిపారు.