calender_icon.png 26 February, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుగ్గలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు ప్రవీణ్ దంపతుల పూజలు

26-02-2025 07:21:42 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): మహాశివరాత్రి ఉత్సవాల భాగంగా బుధవారం శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రేణిగుంట్ల ప్రవీణ్, జ్యోతి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడపాలని రాజరాజేశ్వరునికి మొక్కులు చెల్లించుకున్నట్లు వారు తెలిపారు. ఈసారి బెల్లంపల్లి నుండి బుగ్గ దేవాలయం వరకు రహదారి సౌకర్యం మెరుగుపడడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి జాతరను విజయవంతం చేయాలని కోరారు.