calender_icon.png 26 December, 2024 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమల గెలవాలని సొంతూరులో పూజలు

06-11-2024 12:32:27 AM

తులసేంద్రపురంలో సందడి వాతావరణం

ఢిల్లీ/చెన్నై, నవంబర్ 5: అమెరికా అధ్యక్షురాలిగా డెమోక్రటిక్ అభ్యర్థి, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ గెలవాలని భారత్‌లో ఆమె తరఫున అభిమానులు పూజలు చేస్తున్నారు. కమల తాత పీవీ గోపాలన్, తల్లి శ్యామలా సొంత గ్రామమైన తమిళనాడులోని తులసేంద్రపురంలో ని శ్రీధర్మ శాస్త్ర దేవాలయంలో హారిస్ పేరు మీద గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు.

చందనం, పసుపుతో అభిషేకం చేశారు. పలువురు విదేశీయులు ఈ పూజల్లో పాల్గొన్నారు. ఆమెకు మద్దతుగా పలుచోట్ల బ్యాన ర్లు కట్టారు. కమల గెలిస్తే అన్నదానం చేస్తామని చెప్పారు. తులసేంద్రపురంలో సందడి వాతావరణం నెలకొంది. మధురైలోనూ పూజలు నిర్వహించారు.