calender_icon.png 25 October, 2024 | 2:58 AM

పుడమి క్షోభ మంచిది కాదు

15-10-2024 12:00:00 AM

భూతాపం (గ్లోబల్ వార్మింగ్) గురించి పర్యావరణ శాస్త్రవేత్త లు, సాంకేతిక నిపుణులు ఏడాదికేడాది ఎన్ని నివేదికలు కూర్చి, వెలువరించినా ప్రపంచ దేశాలకు, మరీ ముఖ్యంగా అగ్రరాజ్యాల కు చీమ కుట్టినట్లయినా ఉండడం లేదు. పుడమిని ఇంతలా క్షోభ పెడుతున్న మనిషి రానున్న కాలంలో ఏం సుఖపడతాడో. నమ్మశ క్యం కాని విధంగా మంచు ఖండం అంటార్కిటికాలో గడ్డి మొలవ టం, సహారా ఎడారిలో వరదలు, ఎడారి దేశం సౌదీ అరేబియాలో భారీ వర్షాలు, భారత ఉపఖండంలో హిమనీనదాలు కరగటం, బంగాళాఖతం, అరేబియా సముద్రాలలో వరుస తుపానులు, చైనాలో ఊళ్ళు కొట్టుకుపోయేలా వరదలు, అమెరికాలో టోర్నోడా లు, ఐరోపా దేశాలలో వడగాడ్పులు వంటి భయంకర ఉత్పాతాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికైనా, మానవాళి ఏకమై నివారణ చర్యలు చేపట్టాలి.

 కప్పగంతు వెంకట రమణమూర్తి, సికింద్రాబాద్