calender_icon.png 10 March, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కనీస వేతన గెజిట్‌ను పబ్లిష్ చేయండి

09-03-2025 12:47:26 AM

లేకుంటే.. సీఎస్, ప్రభుత్వ అధికారులు కోర్టుకు హాజరు కావాల్సిందే: హైకోర్టు

హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): కనీస వేతనాలకు సంబంధించిన గెజిట్‌ను వెంటనే ప్రింట్ చేయాలని, గతంలో ఇచ్చిన ఆదేశాలను నాలుగు వారాల్లో అమలు చేయాలని హైకోర్టు శనివారం రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. లేనిపక్షంలో సం బంధిత అధికారులంతా న్యాయస్థానానికి హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేసింది.

ఐదేళ్లకోసారి కనీస వేతనాలను సవరిస్తూ గెజిట్ విడుదల చేయాల్సి ఉండగా, 2007 తర్వాత ఇప్పటివరకు గెజి ట్ ఇవ్వలేదని తెలంగాణ రీజినల్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ 2023లో పిల్ దాఖ లు చేసింది. పిల్‌పై నాడు పిటిషన్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ తన వాదనలు వినిపించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాల పెంపుపై వివిధ ప్రభుత్వ శాఖలు జీవోలు చేసి, ఆ తర్వాత చేతులు దులుపుకున్నాయని, దీంతో  కోటి మందికిపైగా కార్మికులు నష్టపోతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఆరు వారాల్లో గెజిట్ ప్రింట్ చేయా లని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కార్మిక శాఖ కమిషనర్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ ను ఆదేశించింది.

కోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంతో పిటిషనర్ మరోసారి ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పనై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. గతంలో తామిచ్చిన ఆదేశాలను నాలుగు వారాల్లో అమలు చేయాలని లేకుంటే, సీఎస్‌తో పాటు ఇతర కార్మికశాఖ అధికారులు న్యాయస్థానం ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.