కామారెడ్డి, నవంబర్ 17 (విజయక్రాంతి): ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం 181 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. 181 లబ్ధిదారులకు రూ.కోటి 81 లక్షల విలువజేసే చెక్కులను అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్మయి పాల్గొన్నారు.