04-03-2025 12:02:10 AM
గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాసరెడ్డి
చొప్పదండి, మార్చి 3 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ర్టంలో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పని చేస్తుందని గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం గంగాధర మండలం కురిక్యాలలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పనిచేస్తున్నారని అన్నారు.
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో 10 మంది అరులైన లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. కురిక్యాల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.