మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి
కూకట్‌పల్లి/మేడ్చల్, నవంబర్ 26 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మండలి విప్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలో షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి మహేందర్‌రెడ్డి అందజేశారు.
వ్యవసాయానికి ప్రాధాన్యత..
అనంతరం మేడ్చల్‌లో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాల యాన్ని పట్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఏఎంసీ పాలకవర్గంచేత ప్రమాణ స్వీకారం చేయించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి వజ్రేష్ యాదవ్, చైర్మన్ నర్సింహు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.