calender_icon.png 13 April, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సంక్షేమమే ప్రజాపాలన లక్ష్యం

05-04-2025 01:41:34 AM

పల్లెల లక్ష్మణ్

మోతే, ఏప్రిల్4:- ప్రజల సంక్షేమమే ప్రజా పాలన లక్ష్యం మని తెలంగాణ సాంస్కృతిక సారధి జిల్లా టీమ్ లీడర్ పల్లెల లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మామిళ్ళగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన సంక్షేమ పథకాల పై అవగాహన కళాజాతర ప్రదర్శన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లో ప్రజా పాలన లో ప్రతి ఒక్క లబ్దిదారులకు సంక్షేమ అభివృద్ధి పథకాలను చెరవేసి ఆర్థికంగా అభివృద్ధిని చేయడం కోసం కృత నిచ్చయం తో ప్రణాళిక ప్రకారంగా దశల వారీగా అభివృద్ధికి బాటలు వేస్తున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం గ్రామాలలో అన్న నిరుద్యోగ యువత రాజీవ్ యువ వికాసం పేరుతో సుమారు 5లక్షల లోపు సబ్సిడీ తో కూడిన రుణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందాలని కోరారు సన్న బియ్యం తో మూడు పూటలా సంతృప్తి గా భోజనం చేయాలని ఆకాంక్ష తో ప్రతి ఒక్కరికీ 6 కే జి చొప్పున సన్న బియ్యం అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమం లో సాంస్కృతిక సారధి కళా కారులు గంట భిక్ష పతి, వేముల శ్రవణ్, పల్లెల రాము, కుందమల్ల నాగ లక్ష్మి పాల్గొన్నారు.