calender_icon.png 28 April, 2025 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

26-04-2025 12:00:00 AM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గం హన్మకొండ 31వ డివిజన్  లో సుమారు కోటి  రూపాయలతో సుజిత్ నగర్ కాలనీలో రోడ్ల, డ్రైనేజీ పనులకి నగర మేయర్ గుండు సుధారాణి,బల్దియా కమిషనర్ లతో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన శిలాఫలకాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని చెప్పిన ప్రతి హామీ అమలు చేసే తీరుతామని అన్నారు.  డివిజన్ లోని ప్రతి వార్డులో రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైన్ ల నిర్మాణం చేపడుతామని అన్నారు. అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలి.

మంజూరు చేసిన పనులను నిర్నీత సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా న్యూశాయంపేట లో గత 20 సంవత్సరాల నుండి రోడ్డు పక్కన గుడిసెలు వేసుకొని నివసిస్తున్న నక్కల కులానికి సంబంధించిన కోతుల వారికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలన నడుస్తున్నది కావున వారందరికీ  ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ ఇండ్లను గృహాలను నిర్మించి ఇస్తామని వారి జీవితంలో వెలుగులో నింపుతామని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అభివృద్ధి సంక్షేమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి  సంక్షేమం సమపలలో సాగుతుందని  అన్నారు.  ప్రజా ప్రభుత్వంలో  అభివృద్ధి సంక్షేమమే  లక్ష్యంగా ప్రభుత్వం ముందు వెళ్తుందని అన్నారు.

తదనంతరం నక్కల కులానికి సంబంధించిన కోతుల వారి యొక్క వృత్తితో సర్కస్ గంతులు వేస్తూ బ్యాండ్ మేళాలతో వరంగల్ పశ్చిమ  ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి శాలువలతో ఘనంగా సన్మానించినారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్ వేల్పుల మోహన్ రావు, డివిజన్ అధ్యక్షులు అంకేసరపు సురేందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డివిజన్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.