19-04-2025 12:00:00 AM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ, ఏప్రిల్ 18 (విజయ క్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గం వరంగల్ 11 వ డివిజన్ లో ఎంపీ ల్యాడ్ నిధులతో 15లక్షల రూపాయలతో రంగంపేట సిసి రోడ్డు నిర్మాణానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యతో కలిసి శంకుస్థాపన శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని చెప్పిన ప్రతి హామీ అమలు చేసే తీరుతామని అన్నారు.
డివిజన్ లో ప్రతి వార్డులో రోడ్ల నిర్మాణం, మురికి కాలువల నిర్మాణం చేపడుతామని అన్నారు. అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వా మ్యులు కావాలి. మంజూరు చేసిన పనులను నిర్నీత సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అభివృద్ధి సంక్షేమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం సమపలలో సాగుతుందని అన్నారు.
ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందు వెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు గన్నారపు సంగీత్ కుమార్, స్థానిక కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, నాయకులు మహమ్మద్ సమద్, సయ్యద్ అజ్గర్, మాడిశెట్టి రాజ్ కుమార్, గద్దల శివ ప్రసాద్, గన్నారపు కమల్, రమేష్, క్రాంతి, పవన్, మాలతి, సుభద్ర, మహేష్, నిర్మల, ఝాన్సి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.