calender_icon.png 9 November, 2024 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

09-11-2024 12:16:26 AM

  1. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో 
    1. బీటీ రోడ్లకు శంకుస్థాపన చేస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

  2. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 
  3. 14న ‘నేను నా మధిర క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమం 

ఖమ్మం, నవంబర్ 8 (విజయక్రాంతి): ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ఆయన ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో పర్యటించారు. సుమారు రూ.22.10 కోట్ల అంచనాతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. నాగిలిగొండ గ్రామంలో నాగిలిగొండ నాగిలిగొండ  రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అలాగే మధిరలోని తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌తో కలిసి మధిర మున్సిపల్ అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 14న ‘నేను నా మధిర క్లీన్ అండ్ గ్రీన్ ’ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. మధిర మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ గణనీ యంగా పెరిగేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నేను నా మధిర క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు.

మధిర పట్టణంతో పాటు నియోజకవర్గ పరిధిలో పిచ్చి మొక్కల తొలగింపునకు ట్రీ కట్టర్, గ్రాస్ కట్టర్స్ కొనుగోలు చేయాలన్నారు. పారిశుద్ధ్య వాహనాల కు జీపీఆర్‌ఎస్  ట్రాకింగ్‌ను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు.

పచ్చదనం ఉట్టిపడేలా పార్కులు ఏర్పాటు చేయాలన్నారు. మహదేవ్‌పూర్ ఎత్తిపోతల పథకం పనులు జూన్ నాటికి పూర్తి చేయాలని, జాలిమూడి ఎడమ, కుడి కాలువ పరిశీలన చేసి మరమ్మతులు ఉంటే వాటి ప్రతిపాదనలు సమర్పించాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.