calender_icon.png 31 January, 2025 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సంక్షేమానికి పెద్దపీట

26-01-2025 05:25:05 PM

అర్హులందరికి సంక్షేమ పథకాలు

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన పేదలందరికి  అందిస్తామని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఏ ఆ ర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గోని జాతీయ పథకాన్ని అవిష్కరించారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులను ప్రారంభించామని చెప్పారు. లబ్దిదారులను ఎంపిక చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నామని, అర్హుల ఎంపిక ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం వినూత్నంగా ప్రారంభిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి అర్హులైన పేదవారికి అందిస్తామని చెప్పాను.

రైతు సంక్షేమమే ధ్యేయం..

రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషిచేస్తుంది. రైతులకోసం తొలిఏడాది ప్రజా ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు నేస్తం, వరి పంటకు బోనస్, అయిల్ ఫాం పంటల విస్తరణకు ప్రోత్సహకాల వంటి అనేక కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. ప్రతి ఎకరానికి 12 వేల రూపాయల రైతు భరోసా అందిస్తామన్నారు. రెండు లక్షల రుణాలు ఉన్న రైతులకు మాఫీ చేసిందని జిల్లాలో 51 వేల 523 మంది రైతులకు 485.84 కోట్లు రూపాయల మేర రుణమాఫీ చేశామన్నారు. 1441 మంది రైతుల నుంచి 8650 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 40 లక్షల 92 వేల 400 రూపాయల బోనస్ చెల్లించటం జరిగిందన్నారు.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా కనీసం 20 రోజులు ఉపాధి హామీ కూలీలుగా పనిచేసిన భూమిలేని రైతు కూలీ కుటుంబాలను ఆదుకునేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని జిల్లాలో అర్హులను గ్రామ సభల ద్వారా ఎంపిక చేసి అమలు చేయటం జరుగుతుందన్నారు. గూడు లేని నిరుపేదలకు గూడు కల్పించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందని జిల్లాలో 7 వేల ఇండ్లు మంజూరు చేయటం జరిగిందని ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్న కుటుంబాల సర్వే పూర్తిచేసి అర్హులైన లబ్దిదారులను గ్రామ సభల ద్వార ఎంపిక  చేశామన్నారు. రేషన్ కార్డులు లేని వారిని గ్రామ, వార్డు సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి రేషన్ కార్డులను మంజూరు చేసి ప్రొసిడింగ్ కాపీలను అందజేస్తున్నామన్నారు.

రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ,కుమ్రం భీం ప్రాజెక్టుకు 276 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు ద్వారా 21 వేల ఎకరాల అదనపు ఆయకట్టుని సృష్టించేందుకు 172 కోట్లను మంజూరు చేసి పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. స్వయు సహాయక సంఘాలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఇందిర మహిళా పథకం ద్వారా వ్యాపారాల్లో అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో మూడు ఇందిర మహిళా శక్తి క్యాంటీలను ఏర్పాటు చేశామని అన్నారు. రైతు కుటుంబంలో రైతు చనిపోతే రైతు భీమా ద్వారా 5 లక్షలు వారి కుటుంబానికి ఇస్తున్నన్నామని గత ఏడాది కాలంలో 215 మంది  రైతు కుటుంబాలకు 10 కోట్ల 75 లక్షల రూపాయలు అందించటం జరిగిదన్నారు. భూ భారతి ద్వారా కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ధరణిలోని సమస్యలను పరిష్కరించటం జరుగుతుందన్నారు.

ధరణిలోని అన్ని మ్యాడ్యూల్లో పెండింగ్లో ఉన్న 19 వేల 423 దరఖాస్తులను .పరిష్కరించామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ హస్టల్ లలో చదువుతున్న విద్యార్థులకు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం 40 శాతం డైట్ ,200 శాతం కాస్మోటిక్ చార్జీలు పెంచడంతో పాటు కామన్ డైట్ మెనూ అమలు చేస్తుందని తెలిపారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ స్కీమ్ ల కింద జిల్లాలో ఇప్పటి వరకు 1 వేయి 918 ఆడబిడ్డల పేళ్లోళ్ళకు ప్రభుత్వం 21 కోట్ల 27 లక్షల 46 వేల 500 రూపాయలు అందజేసిందని చెప్పారు.ఈ సంద్యంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్నీ డీవీ శ్రీనివాస రావు, అడిషనల్  కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల, ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, ఏఎస్సీ చిత్తరంజన్, అదనపు ఎస్నీ ప్రభాకర్రావు , ఆర్డిఓ లోకేశ్వరరావు, డీఎస్పీలు రామానుజం ,కరుణాకర్  తదితరులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్ కలెక్టర్ కి ఈసీ ప్రశంస..

పార్లమెంట్ ఎన్నికలకు ప్రశాంతంగా సమర్థవంతంగా నిర్వహించినందుకు గాను కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రేకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రశంస దక్కింది. ఈ మేరకు ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టర్ కి ప్రత్యేకంగా ప్రశంసా పత్రాన్ని పంపించారు. ఆదివారం జిల్లా కేంద్రం లోని పరేడ్ గ్రౌండ్స్ నిర్వహించిన వేడుకల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి  కలెక్టర్ కి ప్రశంసా పత్రాన్ని అందించారు. మారుమూల ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా నెట్వర్క్ లేని గ్రామాల్లో పోలింగ్ బూత్ లు ఏర్పాటు, రవాణా తో పాటు కౌంటింగ్ రిజల్ట్ అన్ని విభాగాల్లో సమస్యలు తలెత్తకుండా నిర్వహించారు. ఓటర్ లను ఎక్కువ దూరం నడిపించకుండా అందుబాటులో అక్సిలరి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం, మహిళలు, దివ్యాంగుల తో ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం విశేషం. దీంతో ఓటింగ్ శాతం కూడా పెరిగింది. ఈ ప్రశంసా దక్కడంపై కలెక్టర్ వెంకటేశ్ ఆనందం వ్యక్తం చేసారు. అందరి సహకారం తోనే ఇది సాధ్యమైందని అన్నారు.