21-03-2025 12:56:05 PM
జిన్నారం (గుమ్మడిదల): గుమ్మడిదల మండలం(Gummadidala mandal) నల్లవల్లి శివారులో ని ప్యారనగర్ లో నిర్మిస్తున్న డంపింగ్ యార్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కానుకుంట గ్రామంలో ప్రజా ఓటింగ్ పెట్టారు. శుక్రవారం కానుకుంట గ్రామంలోని యువకులు ఓటింగ్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. డంప్ యార్డు ను వెంటనే రద్దు చేయాలని ఓటింగ్ ద్వారా నిరసన తెలిపారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ డంప్ యార్డు ఏర్పాటు చేస్తే ఇక్కడి ప్రజల జీవితాలు తారుమారు అవుతాయని మాజీ ఉప సర్పంచ్ గోపి అన్నారు.ఓటింగ్ లో గ్రామస్తులు పాల్గొన్నారు. డంపింగ్ యార్డ్ రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని వర తెలిపారు.