హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావడంతో గాంధీభవన్‌లో ప్రజాపాలన విజయోత్సవాల ను నిర్వహించారు. ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించా రు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియంత పాలన నుంచి ప్రజాపాలనను ఆమోదించారని తెలిపారు. నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలను, ప్రజా సంఘాలను హక్కున చేర్చుకున్నది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. కులగణన దేశానికే రోల్ మోడల్ అవుతుందని పేర్కొన్నారు.