calender_icon.png 18 January, 2025 | 5:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకటొచ్చిన… రెండొచ్చిన ఆపుకోవాలా...!

18-01-2025 02:01:00 PM

పరదలతో కమ్మేసిన పబ్లిక్ టాయిలెట్స్...

పాల్వంచ (విజయక్రాంతి): స్వచ్ భారత్ మిషన్ లో భాగంగా పట్టణాల్లో నిర్మించిన ప్రజా మరుగుదొడ్లు, కమ్యూనిటీ టాయిలెట్స్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహించిన స్వచ్ఛత నగరాలు, పట్టణాలకు గుర్తింపునిచ్చింది. పరిశుభ్రమైన పట్టణాలే లక్ష్యంగా అడుగులు ముందుకు వేసింది. బహిరంగ మల విసర్జనను నూరు శాతం నిర్మూలించేందుకు కేంద్రం ప్రజలను భాగస్వాములను చేస్తుంది. అందుకోసం స్వచ్ సర్వేక్షన్ ప్రారంభించింది. ఇదిలా ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడ నియోజకవర్గంలోని పారిశ్రామిక ప్రాంతంగా పేరుందిన పాల్వంచ మున్సిపల్ కార్యాలయం ప్రక్కన ఏర్పాటు చేసిన టాయిలెట్స్ మాత్రం ఏళ్ల తరబడి తాళం వేసి దర్శనమివ్వడం ఒక విశేషం. ఎప్పుడో ఒకరోజు తెరిచిన టాయిలెట్స్ లో వాటర్ రాకపోవడంతో దుర్వాసనకి లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది, సంభందిత అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.