22-03-2025 05:12:18 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని డివైఎఫ్ఐ టిఏజిఎస్ సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ భుజంగరావు కు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... జిల్లా కేంద్రానికి మారుమూల గ్రామాల నుండి ప్రజలు అవసరాల నిత్య రావడం జరుగుతుందని మూత్రశాలలు లేకపోవడంతో మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆసిఫాబాద్ ప్రధాన మార్కెట్ ఏరియాతో పాటు జనకాపూర్ లో టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, బస్టాండ్ వద్ద ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని, వాహనాల కోసం పార్కింగ్ స్థలం కేటాయించాలని కోరారు. ప్రజల అవసరాల కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టీకానంద్, గొడిసెల కార్తీక్, టీఏజిఎస్ జిల్లా అధ్యక్షురాలు మాల శ్రీ పాల్గొన్నారు.