10-03-2025 06:32:37 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): అన్ని రకాల రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని తాహసిల్దార్ దిలీప్ కుమార్ అన్నారు. సోమవారం ప్రజావాణిలో ప్రజల సమస్యలపై పలు దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా తాహసిల్దార్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ... ప్రజలకు భూసమస్యలతో పాటు ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉన్నా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటే తక్షణమే అట్టి దరఖాస్తులను సంబంధిత అధికారిచే పరిశీలించి సమస్య పరిస్కారం చేయడం జరుగుతుందన్నారు.
ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 10:00 గంటల నుండి 2:00 గంటల వరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో అన్ని శాఖల అధికారులు పాల్గొంటారని అన్నారు. మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, ఎంపిడివో సరోజ, ఎస్సై సతీష్, ఏవో శ్రీకాంత్, ఎంపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.