calender_icon.png 18 April, 2025 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలకు అండగా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ

11-04-2025 06:43:23 PM

మందమర్రి (విజయక్రాంతి): నిరుపేదలకు ప్రజా సేవా వెల్ఫేర్ సొసైటీ నిరంతరం అండగా ఉంటూ, సహాయం అందిస్తుందని సొసైటీ ఉపాధ్యక్షుడు సుద్దాల ప్రభుదేవ్, జిల్లా అధ్యక్షుడు నందిపాట రాజులు తెలిపారు. అరకొండ రాజేష్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం పట్టణానికి చెందిన లాల్ మహమ్మద్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా, సొసైటీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.

ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడు సుద్దాల ప్రభుదేవ్, జిల్లా అధ్యక్షుడు నందిపాట రాజు లు మాట్లాడుతూ... సొసైటీ దృష్టికి వచ్చిన ప్రజల సమస్యలకు, వారికి ఏదో రూపంగా సాయం చేస్తామన్నారు. పెళ్లిరోజు, పుట్టినరోజు వేడుకల సందర్భంగా సొసైటీని సంప్రదించినట్లేయితే వారి వంతుగా తామే పేద ప్రజలకు సహాయం చేస్తామన్నారు. దేశంలో ఎంతోమంది ఆకలిలో అలమటిస్తున్నారని, వారందరికీ అందరం కలిసి ఆహారం పెట్టి, దేశంలో ఆకలి మరణం లేకుండా చేద్దామని సూచించారు. ఈ సందర్భంగా అరకొండ రాజేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కార్యక్రమానికి సహకరించినందుకు గాను  ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు  చింటూ, అజయ్, సాయి  పాల్గొన్నారు.