calender_icon.png 18 March, 2025 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేద కుటుంబానికి అండగా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ

18-03-2025 05:52:56 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని నిరుపేద కుటుంబానికి చెందిన మల్లేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా బాధిత కుటుంబానికి ప్రజా సేవా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అండగా నిలిచారు. మంగళవారం బాధిత కుటుంబానికి నిత్యవసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ పట్టణ అధ్యక్షులు నందిపాట రాజు మాట్లాడుతూ... గత  కొన్ని నెలల క్రితం డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న మల్లేష్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా ఇంటికే పరిమితమయ్యారు.

స్థానికులు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీకి సమాచారం అందించారు.పట్టణానికి చెందిన చిన్నారి పూర్వన్ష్ వర్మ పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు సహాయం చేసేందుకు ముందుకు రాగ బాధిత మల్లేష్ కుటుంబానికి  నిత్యవసర  వస్తువులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. పట్టణానికి చెందిన ప్రతి ఒక్కరు పెళ్లి రోజులు, పుట్టిన రోజుల సందర్బంగా నిరుపేదలకు సహాయం చేసేందుకు ముందుకురావాలని కోరారు. దాతలు సేవ చేసేందుకు ముందుకు వచ్చి ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ కి సమాచారం అందిస్తే మీ వంతుగా మేము పేద ప్రజలకు సేవలందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు ఎండీ జావిద్ పాషా, గోపాల్, ప్రవీణ్ లు పాల్గొన్నారు.