calender_icon.png 24 April, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదల సేవలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ

24-04-2025 07:06:16 PM

మందమర్రి (విజయక్రాంతి): నిరుపేదల సేవలో ప్రజా సేవా వెల్ఫేర్ సొసైటీ ముందుంటూ సహాయం అందిస్తుందని సొసైటీ వ్యవస్థాపక ఉపాధ్యక్షుడు సుద్దాల ప్రభుదేవ్, జిల్లా అధ్యక్షుడు నందిపాట రాజ్ కుమార్ లు తెలిపారు. అండ్లూరి సింధూజ, సురేష్ దంపుతుల కుమార్తె చిన్నారి హాన్వి జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం పట్టణంలోని జంగంపల్లి ఓదెలు, కొత్తపల్లి రాజక్క  ఇరువురు పేద కుటుంబాలకు నిత్యవసరకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు ప్రభుదేవ్, రాజ్ కుమార్ లు మాట్లాడుతూ... కొత్తపల్లి రాజక్క భర్త అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా, జంగంపల్లి ఓదెలు ఆర్థిక పరిస్థితి బాగాలేక కటిక పేదరికంలో జీవిస్తున్నారని తెలిపారు.

హాన్వి పుట్టినరోజు సందర్భంగా ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు నిరుపేదలకు నిత్యవసరకులు అంద జేయడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారి హాన్వి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వీరి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ వారి పెళ్లి రోజు, పుట్టినరోజు వేడుకల సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. దేశంలో ఎంతోమంది ఆకలితో అలమటించి పోతున్నారని, వారందరికీ మనమంతా కలిసి ఆహారం అందించి దేశంలో ఆకలి మరణం లేకుండా చేద్దామన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన హాని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు సొసైటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు జావిద్ పాషా, లోబో, చింటూ, చందు, సంజయ్, రాజ్ కుమార్, సాయి తేజ లు పాల్గొన్నారు.