19-03-2025 06:01:58 PM
చలివేంద్రం ప్రారంభించిన సీఐ...
బెల్లంపల్లి (విజయక్రాంతి): జనహిత సేవాసమితి అందిస్తున్న సేవలు అభినందనీయమని వన్ టౌన్ సీఐ ఎన్ ఎన్.దేవయ్య అన్నారు. బుధవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా వద్ద ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ దేవయ్య మాట్లాడుతూ... వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని, జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారని జనహిత సేవా సమితి సభ్యులని అభినందించారు. జనహిత సేవా సమితి అధ్యక్షులు ఆడెపు సతీష్ మాట్లాడుతూ... జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో 9 ఏళ్లుగా చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి రోజు దాతల సహకారంతో మినరల్ వాటర్, మజ్జిగ తో ఎండల నుండి ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్న దాతలు, జనహిత సబ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గెల్లి రాజలింగు జనహిత సభ్యులు పాల్గొన్నారు.