calender_icon.png 22 April, 2025 | 8:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరితగతిన ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి

22-04-2025 12:00:00 AM

సూర్యాపేట, ఏప్రిల్ 21: ప్రతి సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో చేపట్టే ప్రజావాణి లో ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను సంబంధిత అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రాంబాబు అధికారులకు సూచించారు. సోమవారం ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... దరఖాస్తుల పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

మొత్తం 93 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో ఎక్కువగా భూ సమస్యలపై వచ్చినవే 38 ఉన్నాయని తెలిపారు. అనంతరం భారతిరంగా ఆర్గనైజేషన్ ఫర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలోని 700 మంది టీ బి పేషెంట్లకు న్యూట్రిషన్ ఫుడ్ 3000 ప్యాకెట్లు అందజేశారు.