calender_icon.png 25 February, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

25-02-2025 12:00:00 AM

ప్రజావాణిలో అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి

ఖమ్మం, ఫిబ్రవరి -24 (విజయక్రాంతి) : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ, డిఆర్డీవో సన్యాసయ్య లతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజావాణికి సంబంధించి వచ్చిన అర్జీలను పరిశీలన చేసి పెండింగ్ లో లేకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

కలెక్టరేట్ లో కార్యాలయాలు ఏర్పాటు చేసిన వివిధ శాఖలు వారి పరిధిలో ఉన్న ప్రభుత్వ భవనాల వివరాల నివేదికను మంగళవారం సాయంత్రం లోగా అందజేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారిణి ఏ. అరుణ, తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి అదనపు కలెక్టర్లు..

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి) : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకో వాలని అదనపు కలెక్టర్లు వేణుగోపాల్ విద్యాచందన సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు.

గ్రీవెన్స్ లో కొన్ని ఫిర్యాదులు..

చర్ల మండలం వీరాపురం గ్రామానికి చెందిన కర్ల నాగేశ్వరరావు బతకయ్య వీరాపురం గ్రామంలో సర్వే నంబర్. 22/2 లో 49-50 సెంట్ల భూమిని సరిహద్దులు తెలుసుకొనుటకు ఇప్పటికే చర్ల తాసిల్దార్ కార్యాలయంలోదరఖాస్తు చేసి వున్నానని కావున వీరాపురం గ్రామంలో నాకు సంబంధించిన భూమిలో సర్వే నిర్వహించి సరిహద్దులు చూపించవలసిందిగా  చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం  చర్ల తాసిల్దార్‌కు ఎండార్స్ చేశారు.

కొత్తగూడెం హనుమాన్ బస్తీకి చెందిన  పాక వెంకటేశ్వర్లు మా అమ్మ అయినా పాక కనకమ్మ అనారోగ్యం కారణంగా కొంతకాలం మంచానికే పరిమితమై కొంతకాలం క్రితం మా స్వగృహంలోనే మరణించారని గతంలో మా తల్లిగారి మరణ ధ్రువీకరణ పత్రము తీసుకోలేదని నేను నిరక్షరాసుడైన కారణంగా మరణ ధ్రువీకరణ పత్రం ఎలా పొందాలో తెలియక  తీసుకొని లేదని  మా అమ్మ బ్యాంకు ఖాతా నందు ప్రస్తుతం.

రూ.75 వేల  నగదు ఉన్నట్లు బ్యాంకు అధికారులు మాకు తెలియపరచారని అట్టి నగదును వారసుడైన నాకు  చెందాలంటే మా అమ్మగారి మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని బ్యాంకు అధికారులు తెలిపారని, మూడు నెలలు గడిచిన ఇప్పటివర కు ధృవీకరణ పత్రం జారీ కాలేదని అన్నారు.