calender_icon.png 4 February, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి

04-02-2025 12:00:00 AM

అదనపు కలెక్టర్ డి. వేణు

పెద్దపల్లి, ఫిబ్రవరి 3: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించా లని అదనపు కలెక్టర్ డి.వేణు సంబం ధిత జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా అదనపు కలెక్టర్ డి.వేణు సమీకత జిల్లా కలెక్టరేట్ లో  ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.

రామగిరి మండలం సుందిళ్ల గ్రామానికి చెందిన వేముల సతీష్ గ్రామ శివారు లోని సర్వే నెంబర్  409లో 11 ఎకరాల 7 గుంటల పట్టా భూమి ఉందని, దీనికి ప్రస్తుతం రైతు బంధు రావడం లేదని, రైతు భరోసా మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా మండల తహసీల్దార్‌కు రాస్తూ పరిశీలించి సమ స్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాల ని ఆదేశించారు. 

కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామంలో ఉన్న నక్కలా ఒర్రె అనే చిన్న నదికి ఇరువైపులా కట్టడాలు జరుగుతు న్నాయని, ఉన్నది ఆక్రమణకు గురవు తుందని , ఐకేపి కోసం  సర్వే నెంబర్  66 లో భూమి చదును చేస్తే ఒక సింగరేణి ఉద్యోగి తన పేరు మీదకు ఎక్కించుకున్నారని, ప్రభుత్వ భూములు కబ్జాకి కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా శ్రీరాం పూర్ తహసిల్దార్,  ఏడి ల్యాండ్ సర్వేల కు రాస్తూ చర్యలు చేపట్టాలని  తెలిపా రు. 

రామగిరి మండలం వకీల్ పల్లె గ్రామానికి చెందిన స్వప్న తన భర్త దివ్యాంగుడైనందున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా హౌసింగ్ విభాగా నికి రాస్తూ అర్హత మేరకు మంజూరుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.  ఈ కార్యక్రమంలో  సంబం ధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.