- ప్రాణాలు పోతున్నా ప్రజల క్షేమమే లక్ష్యం
- జనం కోసం కుటుంబాలకు దూరం
- స్ఫూర్తిదాయకం ఎస్‌కే వ్యాస్, పరదేశీ నాయుడు
- నేడు పోలీసు అమరవీరుల దినోత్సవం
నాగర్‌కర్నూల్, అక్టోబర్ 20(విజయక్రాంతి): ప్రజల రక్షణే వారి లక్ష్యం.. ప్రాణా లు పోతున్నా జనం కోసం పరితపించిన నైజం.. ప్రజల కోసం ఎంతోమంది రక్షకభటులు ప్రాణాలను తృణప్రాయంగా వదిలే శారు. విధి నిర్వహణలో ఉగ్ర మూకలు, నక్సల్స్‌తో పోరాడుతూ ఎంతోమంది పోలీసులు వీరమరణం పొందారు.
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన నల్లగొండ, ఉమ్మడి పాలమూ రు జిల్లాలోని ముఖ్యమైన పోలీసు అధికారులు తమ కుటుంబాలకు దూరంగా ఉం టూనే కంటిమీద కునుకు లేకుండా ప్రజారక్షణ కోసమే పనిచేశారు. నక్సల్స్ అణిచి వేతలో భాగంగా గ్రేహౌండ్స్ దళాల సృష్టికర్తగా వ్యవహరించిన వారిలో ఒకరు కే ఎస్ వ్యాస్.
అప్పట్లో నక్సల్స్ కదలికలను గుర్తి స్తూ, ఎప్పటికప్పుడు వారిని అణిచివేస్తూ ప్రజలను కాపాడే ముఖ్యపాత్ర పోషించి ఎంతోమంది పోలీసు అధికారుల్లో ఆయన స్ఫూర్తి నింపారు. ఆయనను టార్గెట్ చేసిన నయీం దళం 1993 జనవరి 27న హైదరాబాద్ నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో దారుణంగా అంతమొందిం చారు. ఈ ఘటనతో అప్పట్లో యావ త్ దేశం అట్టుడుకిపోయింది.
వ్యాస్ అడుగు జాడల్లో పరదేశీ నాయుడు
మంచి అధికారిని కోల్పోయామన్న బాధ లో ఉన్న ప్రజలకు భరోసా కల్పించడంతోపాటు నక్సల్స్ ఏరివేతకు ఉమ్మడి పాలమూ రు జిల్లా ఎస్పీగా పనిచేసిన పరదేశీ నాయు డు నడుం బిగించారు. ఈయన కూడా కేఎస్ వ్యాస్ అడుగుజాడల్లో నడుస్తూ భయం లేకుండా ప్రజాక్షేమం కోసమే ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పనిచేశారు.
అదే ఏడాది నవంబర్ 13న కొల్లాపూర్ సోమశిల ప్రాంతంలోని ఫారెస్ట్ గెస్ట్‌హౌజ్‌కు నక్సల్స్ నిప్పు పెట్టారు. ఇది తెలిసి ప్రజలకు భరోసా కల్పించడం కోసం మరుసటి రోజు నల్లమల పర్యటన కార్యక్రమాన్ని ఫిక్స్ చేసుకున్నారు. మొదట అమ్రాబాద్ వెళ్లాల్సిన వారు కొల్లాపూర్ నుంచి ఓ ప్రయివేటు బస్సులో సోమశిలకు వెళ్లి అక్కడి ప్రజల్లో భరోసా కల్పించారు.
దీంతోపాటు భ ద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించా యి. కానీ, అప్పటికే పోలీసులను నక్సల్స్ టార్గెట్ చేసినట్లు గుర్తించలేక పోయారు. తిరుగు ప్రయాణంలో బస్సు కింద మందుపాతర పేల్చడంతో గాల్లోకి ఎగిరిపడింది. ఊహించని ఈ ఘటనతో పరదేశీనాయుడితోపాటు సిబ్బంది కూడా తీవ్రంగా గాయప డ్డారు. రక్తపు మడుగులో ఉన్నా ఎదరుదాడికి దిగారు.
ఆయుధాలతో సహా లొంగి పోవాలని నక్సల్స్ హెచ్చరించినా.. వెనక్కి తగ్గకుండా సిబ్బందికి ఆదేశాలిచ్చినట్టు అప్ప ట్లో వార్తలొచ్చాయి. బాంబు దాడిలో తీవ్రం గా గాయపడి రక్తపు మడుగులో ఉండి కూ డా నక్సల్స్ చేతిలోకి చిక్కకుండా సిబ్బందికి అదేశాలు ఇస్తూ వీరమరణం పొందారు. ఈ దుర్ఘటనలో పరదేశీనాయుడితోపాటు తన వెంట ఉన్న మరో 10 మందికి పైగా సిబ్బంది అమరులయ్యారు.