calender_icon.png 24 November, 2024 | 7:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో ప్రజా తిరుగుబాటు!

24-11-2024 04:44:56 AM

కాంగ్రెస్ పార్టీతో జతకడితే మునుగుడే 

కేంద్ర మంత్రి బండి సంజయ్ 

కరీంనగర్, నవంబర్ 23 (విజయక్రాంతి): తెలంగాణలోనూ ప్రజా తిరుగుబాటు మొదలు కాబోతుందని, ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ యుద్ధం ప్రకటించనున్నట్టు కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ స్పష్టం చేశారు. శనివారం మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కూటమిని అక్కడి ప్రజలు నమ్మలేదన్నారు. మోదీ అభివృద్ధి మంత్రం పనిచేసిందనడానికి గతానికి మించి సీట్లు రావడమే నిదర్శనమన్నారు.

కాంగ్రెస్ ఐరన్‌లెగ్ పార్టీ.. దానితో జతకట్టిన పార్టీలన్నీ మునిగిపోతున్నాయన్నారు. తెలంగాణలోనూ ఆ పార్టీలో లుకలుకలు ప్రారంభమవుతాయని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం బీజేపీకి లేదని.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూల్చుకుంటారని చెప్పారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి అడ్రస్ గల్లంతయ్యిందన్నారు. అక్కడి ప్రజలు ఐక్యతగా హిందుత్వం వైపు నిలబడ్డారన్నారు. తెలంగాణ నుంచి మహారాష్ట్రకు డబ్బు సంచులు తరలించినా ఫలితం లేకపోయిందన్నారు. తెలంగాణ, కర్ణాటకలో వైఫల్యాలే మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమికి కారణమన్నారు.