calender_icon.png 11 April, 2025 | 11:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర మంత్రులను కలిసిన ప్రజాప్రతినిధులు

04-04-2025 12:00:00 AM

ఆదిలాబాద్/కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): అదిలాబాద్‌లో పౌర విమానాశ్రయానికి భారత వైమానిక దళం ఆమోదం తెలపడం పట్ల ఉమ్మడి జిల్లా బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా అదిలాబాద్ విమానాశ్రయానికి భారత వైమానిక దళం నుంచి అనుమతులు ఇప్పించినందుకు కృతజ్ఞతగా పౌర విమానయాన శాఖ మంత్రి కిం జారపు రామ్మోహన్ నాయుడుని ఢిల్లీలో గురువారం ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, రామారావు పటేల్, పాల్వాయి హరీష్‌బాబులు కలిసి ఘనంగా సత్కరించారు.

వీలైనంత త్వరగా అదిలాబాద్ విమానాశ్రయం అభివృద్ధి చేసి పౌర విమాన సేవలను అందుబా టులోకి తీసుకురావాలని వారు కోరారు. దీంతో పాటు వాయుసేన శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని వారు కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జాతీ య రహదారులకు సంబంధించి నితిన్ గడ్కారీకి వినతి పత్రం అందజేశారు.