27-04-2025 06:47:18 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో శనివారం కలెక్టర్ పర్యటన సందర్భంగా తహసీల్దార్ సంజయ్ రావు(Tehsildar Sanjay Rao) తీరుపై స్థానిక ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో కలెక్టర్ ఆధ్వర్యంలో భూభారతి కార్యక్రమం ఉందని తమకు సమాచారం ఇవ్వలేదని, బిక్కనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, సింగిల్ విండో చైర్మన్ నాగరాజు రెడ్డి, మాజీ సర్పంచ్ నల్లపు శ్రీనివాస్, పలువురు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఎస్సై స్రవంతి ఇతర అధికారులు వారిని సమదయించే ప్రయత్నం చేశారు.