కొండపాక: సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి కలెక్టర్ మను చౌదరి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందజేసిన ఫిర్యాదులను పరిశీలించి వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 117 దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నాగరాజమ్మ, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.