calender_icon.png 3 April, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యలను పరిష్కరించాలి

27-03-2025 01:35:29 AM

సూర్యాపేట, మార్చి 26: కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా నేటికి జిల్లాలో ప్రజా సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి దుయ్యబట్టారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు.

ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ.... తమది ప్రజ లు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం అని గొప్ప లు చెప్పుకొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం వారి సమస్యలను గాలికి వదిలేసిందన్నారు. సాగు, త్రాగు నీరు లేక అనేక గ్రామాల్లోని ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఎండిన పంట పోలాలను చూసి రైతులు కన్నీరు పెట్టుకున్నారని పేర్కొన్నారు.

మహిళలు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభు త్వం రైతాంగానికి రైతు భరోసా పథకాన్ని అందిస్తామని చెప్పి, కేవలం రెండు ఎకరాలకు మాత్రమే రైతుబంధు ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. గృహలక్ష్మి పథకం క్రింద ప్రతి మహిళకు నెలకు రూ. 2500 ఇస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికీ ఇవ్వలేదన్నారు. వ్యవసాయ కార్మికులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అందిస్తామని ఏడాదికి రూ. 12000 లను అమలు చేసిన పాపాన పోలేదన్నారు.

ఇందిరమ్మ పథకం ద్వారా ఇస్తామన్న రూ. 5 లక్షలతో  పేదల ఇండ్ల నిర్మాణం సాధ్యం కాదని, ఉభయ ప్రభుత్వాలు కలిపి ఒక్క ఇంటి నిర్మాణానికి రూ.15 లక్షల చొప్పున ఇంటి నిర్మాణ వ్య యాన్ని పెంచాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రెండు పడకల గదుల ఇళ్ళన్ని శిథిలావస్థకు చేరుకున్నాయ ని, వాటికి మరమ్మతులు చేయించి అర్హులకు అందించాలన్నారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు.