calender_icon.png 22 April, 2025 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత

15-04-2025 01:21:47 AM

మాజీ మంత్రి మల్లారెడ్డి 

మేడ్చల్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): 16 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత  ఏర్పడిందని, ఆ పార్టీ నాయకులు సైతం పార్టీ వీడుతున్నారని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నా రు. సోమవారం కీసర మండ లం చిర్యాల గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మల్లారెడ్డి సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. వీరికి మల్లారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధి కారంలోకి వచ్చిందన్నారు. ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేయడం లేదన్నారు. ఏ  ఎన్నిక వచ్చిన బి ఆర్ ఎస్ గెలుపు ఖాయం అన్నారు. చిర్యాల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారి మధు యాదవ్, బండారి భాస్కర్ యాదవ్, మల్లారపు మురళి గౌడ్, గుండ్లపల్లి కిరణ్ గౌడ్, కోళ్ల శ్రీశైలం యాదవ్, కోళ్ల కిషన్ తో పాటు పలువురు బీఆర్‌ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.