calender_icon.png 26 March, 2025 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి

24-03-2025 04:24:58 PM

తహసిల్దార్ సతీష్ కుమార్..

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని వివిధ గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న భూ తగాదాల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని భూతగాధాలు పరిష్కరించుకోవాలని మండల తహసిల్దార్ సతీష్ కుమార్ కోరారు. సోమవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో భూతగాదాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా క్యాతనపల్లి పరిధిలోని సర్వే నెంబర్ 348, సర్వే నెంబర్ 15 లో సరిహద్దు తగాదాలను పరిష్కరించాలని కోరుతూ సంబధిత వ్యక్తులు దరఖాస్తులు అందచేశారు.

ఈ సందర్భంగా మండల తాహసిల్దార్ సతీష్ కుమార్ మాట్లాడుతూ... మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో నేటి వరకు భూతగాదాలకు సంబంధించిన ఏడు దరఖాస్తులు రావడం జరిగిందని అందులో రెండు దరఖాస్తులను పరిశీలన చేసి పరిష్కరించడం జరిగిందని మిగిలిన ఐదు దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మండలంలోని రైతులు, భూ యజమానుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని మండల వాసులు సద్వినియోగం చేసుకొని తమ భూమి తగాదాలను పరిష్కరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్, రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్ లు పాల్గొన్నారు.