25-03-2025 01:07:57 AM
మెదక్, మార్చి 24(విజయక్రాంతి)ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రజావాణికి 85 దరఖాస్తులు వచ్చాయి. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలోసోమవారం నిర్వహించిన ప్రజావాణిలోడి ఆర్‌ఓ భుజంగరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్యతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఆయా శాఖలకు వచ్చిన అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. ఆర్జీలలో ధరణి సమస్యలపై 30, పెన్షన్ కోసం 3, ఇందిరమ్మ ఇండ్లు 3, ఉద్యోగ ఉపాధిపై 2, ఇతర సమస్యలపై 47 మొత్తం 85 దరఖాస్తులు ప్రజల నుంచి అందాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.